Saturday, June 25, 2011

lokki pikkaa


మరమో బుజ్జి పాపాయి ఇంచక్క్క  యోదా (యోగా) తసండ్రా ( కసండ్రా) యోస్(రోజ్) ఇలా మాట్లాడుతూ ఉండేదా.. నాకేమో ముద్దు ముద్దు గా ఉండేది కొన్నాళ్ళకి అది యోదా  అన్నా నాకు యోగ అనే విన్పించేది. కానీ ఊరందరికీ అల్లా కాదు కదా
మేము భారతానికి తిరిగి వచ్చి ఊళ్లంమాట తిరుగుతున్నప్పుడు దీని అభిమానులు అందరూ దీనికి క, గ, ర నేర్పించడమే.. ఇక అవే వస్తాయిలీ అనుకుంటున్నా వాళ్ళం కాస్తా ( ఎందుకంటే క్లియర్ గ్లౌ ఇవి మాములుగానే చెప్పేది) 
ఒకరోజు రాత్రి భోజనాల తరువాత సరదాసరదా గా ఈ ఆట మొదలు పెట్టాం నాన్న క పదాలన్నీ వట్టి వట్టి చెప్పడం బూ పాప repeat చెయ్యడం నేను ఇంకో  మాటా  జోడించడం అల్లా అన్నమాట.

ఆశ్చర్యం ఒక్క పూటలోనే పలకడం నేర్చేసుకుంది దొంగ పిల్ల 

ఇక మర్నాటి నించీ ప్రాక్టీసు అన్నమాట ఇంతకూ ముందు క కి ట చెప్తుంది కదా ఇప్పుడు ట ప్లేస్ లో కూడా కా నే

అమ్మ అట్లు వేస్తుంటీ అక్కు పెక్కూ అంటుంది.

లొట్టి పిట్టా అనవే అంటే లోక్కి పిక్కా అంటుంది

అప్పట్నుంచీ బూపాపా సహస్ర నామావళి లోకి ఈ పేరు చేరింది.

అమ్మ అదీ కలిసి లోక్కి పిక్కా నువ్వు లోక్కి వైతే నేను పిక్కనవుతా అని పాట కూడా కూర్చేసుకున్నారు.



ఏంటి మీరేనా నాకు పేర్లు పెట్టేది నేనూ పెట్టుకుంటా అని మొదలుపెట్టింది అది మరో కథా! 

No comments:

Post a Comment