Tuesday, March 15, 2011

                                                  ఆద్యంత రహితాయ నమహా

     మొన్న నేను మామూలుగా సోఫా లో కూచుని నెట్టు మీదో మరోటో పని చేస్కున్టున్నపుడు నా లొక్కిపిక్క  కూడా మామూలుగానే ఏదో కథ చెప్తూనో బొమ్మ చేస్తూనో ముద్దు ముద్దు గా కన్పించినప్పుడు అలా అన్పించింది.
లొక్కి పిక్క కథ మరొక పోస్ట్ లో 

ఇప్పుడు మహాబలేశ్వర్ కథ కొనసాగిద్దాం.

ఆది నుంచీ అపస్వరాలతో మొదలయీ ,నాన్న నేను ముందే  చెప్పా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటె పాపం అమ్మ ఇంత దూరఓ   ఈ కాని టైం లో వచ్చినందుకైనా ఈ ట్రిప్ బాగుంటే బాగున్ను అంకుంటూ ఆ గుర్రలబ్బై దగ్గిరకి వెళ్లి రెండు ఫోటోలు తీస్కుంది.వాడన్నాడు ఏభై రూపాయలకి ఒక రౌండ్ తిప్పుతా అని
అమ్మ: మేము ఈ రోడ్ మీద తిరగం వుడ్స్ లో అయితే చెప్పు
గుర్రం వాడు: తప్పకుండా ఇక్కడకి దగ్గరలో నే ఉంది పెద్ద అడవి అక్కడ్నించి మీకు నీళ్ళు కూడా( వెన్న lake ) కన్పిస్తాయి మూడు వందలిస్తే  చాలు.
ఈలోపు నాన్న బూపాప వచ్చారు అమ్మ వాళ్లకి సంభాషణ అంతా చెప్పింది. నాన్న ముందు మనం ఎక్కడ ఉండాలో చూస్కుందాం అంటే వాళ్ళు  వెంటపడ్డారు సరే పోనీ రెండొందల ఏభై ఇవ్వండి అంటూ
అమ్మ కి భలే మంచి బేరం అన్పించింది నాన్న అంది ఆ రేటు మనిషికి అదే గుర్రానికి అందరికీ కలిపి కాదని
అమ్మకి కళ్ళు తిరిగాయి చివరకి అదే కరెక్ట్ అని తేలడం తో ఇక ఈ ఊళ్ళో గుర్రం ఎక్కట్లేదు అని నిశ్చయం చేస్కుని మళ్ళీ రోడ్డెక్కాం .

ఇంకా చాలా చోట్ల commerciality  penthouse  అదే height లో కన్పించింది


ఇక తరువాత మేమేల్లిన ప్లేస్ వెన్న lake  బుజ్జి పాపాయికి నెయ్య lake  ఎందుక్కాదు అనే డౌట్ వచ్చింది నవ్వుకుని అక్కడి కూరగయల బుట్టలూ, గుర్రాలూ చూసుకుంటూ  echo పాయింట్, kates  పాయింట్     చేరాం.

మొదటిసారిగా ఎంజాయ్చేసాం  ఈ ట్రిప్ లో అన్నట్లు దారిలో ఒక straw  berry  farm  కన్పించింది. కానీ upick  ఇప్పుడు కాదు రేపు ఉదయం రమ్మన్నాడు అదీ ఏదో ధర్మానికిస్తున్నట్లు మొహం పెట్టి నాలుగు ఫోటోలు తీసుకొని అక్కడ్నించి బయలుదేరాం.




echo point చేరుతూనే మాకు బుల్లి బుల్లి మారుతిలు కన్పించాయి. ఒకడయితే చక్కగా రైలింగ్ మీద కూచుని వచ్చే పోయే వాళ్ళని గమనిస్తున్నాడు. అమ్మ, నేను వాడితో కాసేపు మాట్లాడి బ్యాక్ గ్రౌండ్ లో నాన్న షరా మామూలుగానే అవి మీదపదిపోతాయి అది చేస్తాయి ఏది చేస్తాయి అని అరుస్తున్నా మేము  చక్కగా పెద్దవీ చిన్నవీ, అమ్మలు, నాన్నలూ అన్ని కోతుల్ని ఒకటే ప్లేస్ లో చూస్తె చాలా బాగుంది. ఇక మనుషులు వాళ్ళ లోకం లో వాలూ guide  లు చూపిస్తూంటే ఒక గ్రూప్ అరిచి ఎకో చూస్కుంటున్నారు. మరికొందరేమో ముఖ్యంగా ఆడ వాళ్ళు ఏదో  ఈ బుల్లి వానరాలకు వాళ్ళని ఎటాక్ చెయ్యడమే పని అన్నట్లు ఎక్ష్ప్రెస్సిఒన్ లూ   అరుపులూ.

అరె ఇదేమిటీ ఈయన బాగ్ లోంచి టొమాటోలు తీసి  పెడుతున్నాడు. మొదట్లో ఎవరూ నమ్మలేదు దూరంగా పారిపోయారు. ఒక ఆల్ఫా మేల్ వచ్చి అందర్నీ హెచ్చరించింది మెల్ల మెల్లగా ఒకల్లూ ఇద్దరూ తరువాత అందరూ వచ్చి ఈయన చేతుల్లోంచి తీసుకొని తిన్నారు. ఆయన కూడా పిల్లలకి పెడుతున్నట్టే పెట్టాడు రోజూ వస్తాడేమో మరి.వ్యూ కూడా ఇక్కడ్నుంచి చాలా బాగుంది. 
 తర్వాతి పాయింట్ పేరు క్రీం పాయింట్ ఒక icecream  పార్లర్ కి అలా పేరు పెట్టుకున్నారు .అక్కడేమో మేము కూడా ఒక క్రీం కొని చల్ల బడుతుంటే మాకు suddenly  rainbow బట్టల్లో కొంతమంది కన్పించారు. ఆడవాళ్ళూ , పిల్లూ మంచి కలర్ఫుల్  బట్టల్లోనూ మగవాళ్ళు మాత్రం మామూలు బట్టల్లో అందరూ bikes   ఎక్కి వెళ్తున్నారు. ఒక ఆవిడ మొహమాట పడుతూ ఫోటో తీసుకోవడానికి ఒప్పుకుంది. రాజస్తాన్ నుంచి వచ్చారట. జీవితం రంగులమయం అయినా రంగూ, డిజైన్ అంటే రాజస్తాన్ తరువాతే ఎప్పుడు ప్రాప్తమో నాకు!  

ఇంతకీ మాకు బస ఎక్కడ కుదిరింది, ఇంకా ఏమేం చూసాం చేసాం ఇవి తరువాతి పోస్ట్ లో..........



mahabaleswar panchagani

                          

మొత్తానికి ఉదయం పది గంటలకి బయలుదేరాల్సిన బండి సాయంత్రం చీకటి పడక   ముందే  బయలుదేరింది. పన్వేల్  దాటాక కాస్త హాయిగా అన్పించడం మొదలు పెట్టినా ఇంకా వాహనాలు బాగానే ఉన్నాయి రోడ్ మీద. కర్నాల చేరాం.
రోడ్ మీద బోలెడన్ని కూరలు పళ్ళ దుకాణాలు. మేము కొన్ని బత్తాయిలు, అనాసపనస, ద్రాక్ష, కొన్ని కీర దోసాలు బాగా బేరమాడి పనిలో పనిగా మహాబలేశ్వర్ ఎలా వేళ్ళలో ఎక్కడ మజిలీ చెయ్యచ్చో కనుక్కుని ముందుకెల్లాం.
కామత్ , ప్రియాంక (ఇవి అమ్మ, నాన్నలకి ముందే తెలుసు ) దాటాక ఒక బుల్లి వెజ్ హోటల్ గుడి కన్పించాయి.అక్కడ చపాతీ థాలి తిన్నాక ముందుకా వెనక్కా అని కాసేపు చర్చ జరిగింది. (అమ్మ నాన్న తీవ్రంగా చర్చించు కున్నారు , ముందుగా అనుకున్నట్లు పక్క గుడి కి కూడా వెళ్ళలేదు మేము?!)

           మడమ తిప్పడం ఇష్టం లేక ఇంటి కి వెళ్ళే ధైర్యం  లేక మళ్ళీ ఎప్పటికి బయటపడగాలమో తె లియక ఇలా చాలా లక లక లతో ముందు కు వెళ్ళడానికే సిద్దమయి ప్రయాణం కొనసాగించాం.ఇక మాన్గావు లో చిన్న హోటల్ లో రాతరికి  విశ్రాంతి. గుడులకు వెల్ల కూడని కారణం తో మాహాడ్ లో  కాసేపు చిన్నూరిలో షాపింగ్ నడక,ఒక చిన్ని శివరాత్రి జాతర చూసుకొని సాగిపోయాం.



మా తరువాతి మజిలీ ఒక మామిడి చెట్టు. చక్కగా కీర దోసాలు, పైనాపిలూ తిన్నాం. అక్కడ మా గోమాతకి కొన్ని కీరదోసలు తిన్పించి అందరికీ మూమూ అని బై బై చెప్పి కొండ మీదకి ఎక్కుకుంటూ వెళ్ళాం.ఎంత ఎత్తో చాల పెద్ద ఘాట్ లోతైన లోయలు  ఈ ప్రమాదకరమైన రోడ్ దాటి మహా బలేశ్వర్ చేరే సరికి హమ్మయ్య అన్పించింది. strawberries  స్వాగతం పలికాయి. farm  కి  వెళ్ళాలి అన్ని చెయ్యాలి చూడాలి అనుకుంటూ మేము ముందు Tax  కట్టండి అని అక్కడి commerciality  తోలి రుచి చూపించాడు మహాబలేశ్వరుడు (like  tcser ) మీకు నేను మంచి బస చూపిస్తా అని వెంటపడ్డాడు మరొకడు.

                              నమ్మచ్చా అని సందేహిస్తూనీ వాణ్ని అనుసరించాం  కానీ  ఆ ప్లేస్ బానే ఉంది. 900  కి ఒక duplex  గది. మేము ఇంకా తక్కువకు దొరుకుతుందేమో అని  వెల్ల బోతుంటీ తనే మళ్ళీ మార్కెట్ లో 1200  గది చూపించాడు 600  కి  చూపిస్తా అని తీస్కి వెళ్లి. అందులో లాజిక్ మాకు అర్ధం కాలే.మార్కెట్ బాగా చిన్ని రోడ్ బోల్డన్ని షాప్లు, హొతెల్లూ, జనాలతో కళ కళ లాడుతోంది. ఈ రోజు శివరాత్రి అని ఆ రోడ్ మీదే ఒక వైపు బ్లాక్ చేసి స్టేజి తాయారు చేసి ఏవో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.మేము మంచి భోజనం చేసాకే ఇంకేమైనా అని గుజరాతి థాలీ చెప్పాం. బూ పాప షీరా తో అమ్మ దాల్ తో నాన్న కూరతో తిని బయట పడ్డాం.అప్పదికే సాయంత్రం 4 అవుతోంది బయట గుర్రాలతో ముగ్గురు అబ్బాయిలు కన్పించారు. 50  రూపాయలకి ఒక రౌండ్ తిప్పుతాం అంటూ.

అసలు కథ తరువాతి పోస్టుల్లో .....
                                                                   మరో కోణం  

                                          


బూ పాపా  బొజ్జ లో ఉన్నప్పటి నుంచీ అవసరం వల్ల నో సరదాకో ,బతుకు తెరువు కోసం ఇలా మేము తిరుగుతూనే  ఉన్నాం. Thank fully She also took it well sofar and infact enjoys traveling. Here living in this match box which turns into a gas chamber some nights we are longing to escape .Ironically all the ads of houses say that " escape to", "get away from" " far from the maddening crowd"


My intellect fails to understand why participate in the maddening business and then escape? If not what would happen to LCD TV manufacturers, cosmetics, clothes ,TV channels, Hotel industry and last but not the least spirituality clubs




Any way so We finally had a chance to "get away" for a few days. Traditionally we research , see videos, study all available literature from official sources to blogs and then plan extensively but here it's on a whim .So we had more than a few surprises many of them not so pleasant  awaiting us.






In India we don't need to bother so much about Food is  false Virtually no place that could cater to our gentle palate. and then the prices would kill your appetite.And in our return journey we tasted food poisoning. Our stomachs could take it but Shiv's gentle system struggled and sent it all out.


at least there we had the option of organic fruits and baked items which come to our rescue here even fruits are contaminated with god forbidden chemicals..


Now from here on we will definitely think and plan much more.