మొత్తానికి ఉదయం పది గంటలకి బయలుదేరాల్సిన బండి సాయంత్రం చీకటి పడక ముందే బయలుదేరింది. పన్వేల్ దాటాక కాస్త హాయిగా అన్పించడం మొదలు పెట్టినా ఇంకా వాహనాలు బాగానే ఉన్నాయి రోడ్ మీద. కర్నాల చేరాం.
రోడ్ మీద బోలెడన్ని కూరలు పళ్ళ దుకాణాలు. మేము కొన్ని బత్తాయిలు, అనాసపనస, ద్రాక్ష, కొన్ని కీర దోసాలు బాగా బేరమాడి పనిలో పనిగా మహాబలేశ్వర్ ఎలా వేళ్ళలో ఎక్కడ మజిలీ చెయ్యచ్చో కనుక్కుని ముందుకెల్లాం.
కామత్ , ప్రియాంక (ఇవి అమ్మ, నాన్నలకి ముందే తెలుసు ) దాటాక ఒక బుల్లి వెజ్ హోటల్ గుడి కన్పించాయి.అక్కడ చపాతీ థాలి తిన్నాక ముందుకా వెనక్కా అని కాసేపు చర్చ జరిగింది. (అమ్మ నాన్న తీవ్రంగా చర్చించు కున్నారు , ముందుగా అనుకున్నట్లు పక్క గుడి కి కూడా వెళ్ళలేదు మేము?!)
మడమ తిప్పడం ఇష్టం లేక ఇంటి కి వెళ్ళే ధైర్యం లేక మళ్ళీ ఎప్పటికి బయటపడగాలమో తె లియక ఇలా చాలా లక లక లతో ముందు కు వెళ్ళడానికే సిద్దమయి ప్రయాణం కొనసాగించాం.ఇక మాన్గావు లో చిన్న హోటల్ లో రాతరికి విశ్రాంతి. గుడులకు వెల్ల కూడని కారణం తో మాహాడ్ లో కాసేపు చిన్నూరిలో షాపింగ్ నడక,ఒక చిన్ని శివరాత్రి జాతర చూసుకొని సాగిపోయాం.
మా తరువాతి మజిలీ ఒక మామిడి చెట్టు. చక్కగా కీర దోసాలు, పైనాపిలూ తిన్నాం. అక్కడ మా గోమాతకి కొన్ని కీరదోసలు తిన్పించి అందరికీ మూమూ అని బై బై చెప్పి కొండ మీదకి ఎక్కుకుంటూ వెళ్ళాం.ఎంత ఎత్తో చాల పెద్ద ఘాట్ లోతైన లోయలు ఈ ప్రమాదకరమైన రోడ్ దాటి మహా బలేశ్వర్ చేరే సరికి హమ్మయ్య అన్పించింది. strawberries స్వాగతం పలికాయి. farm కి వెళ్ళాలి అన్ని చెయ్యాలి చూడాలి అనుకుంటూ మేము ముందు Tax కట్టండి అని అక్కడి commerciality తోలి రుచి చూపించాడు మహాబలేశ్వరుడు (like tcser ) మీకు నేను మంచి బస చూపిస్తా అని వెంటపడ్డాడు మరొకడు.

నమ్మచ్చా అని సందేహిస్తూనీ వాణ్ని అనుసరించాం కానీ ఆ ప్లేస్ బానే ఉంది. 900 కి ఒక duplex గది. మేము ఇంకా తక్కువకు దొరుకుతుందేమో అని వెల్ల బోతుంటీ తనే మళ్ళీ మార్కెట్ లో 1200 గది చూపించాడు 600 కి చూపిస్తా అని తీస్కి వెళ్లి. అందులో లాజిక్ మాకు అర్ధం కాలే.మార్కెట్ బాగా చిన్ని రోడ్ బోల్డన్ని షాప్లు, హొతెల్లూ, జనాలతో కళ కళ లాడుతోంది. ఈ రోజు శివరాత్రి అని ఆ రోడ్ మీదే ఒక వైపు బ్లాక్ చేసి స్టేజి తాయారు చేసి ఏవో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.మేము మంచి భోజనం చేసాకే ఇంకేమైనా అని గుజరాతి థాలీ చెప్పాం. బూ పాప షీరా తో అమ్మ దాల్ తో నాన్న కూరతో తిని బయట పడ్డాం.అప్పదికే సాయంత్రం 4 అవుతోంది బయట గుర్రాలతో ముగ్గురు అబ్బాయిలు కన్పించారు. 50 రూపాయలకి ఒక రౌండ్ తిప్పుతాం అంటూ.
అసలు కథ తరువాతి పోస్టుల్లో .....
అసలు కథ తరువాతి పోస్టుల్లో .....
No comments:
Post a Comment